Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భూమా అఖిలప్రియకు బెయిలు.. ఆమె భర్తకు ముందస్తు బెయిలు నిరాకరణ!

Court grants bail to Bhuma Akhila Priya
  • కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు బెయిల్ మంజూరు
  • భార్గవ్ రామ్ కు ముందస్తు బెయిల్ నిరాకరణ
  • గత 17 రోజులుగా చంచల్ గూడ జైల్లో ఉన్న అఖిలప్రియ
హైదరాబాద్ బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి అఖిలప్రియకు ఊరట లభించింది. ఆమెకు సికింద్రాబాద్ లోని సెషన్స్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ. 10 వేల పూచీకత్తుతో పాటు, ఇద్దరు వ్యక్తుల షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. గత 17 రోజులుగా చంచల్ గూడ జైల్లో రిమాండులో అఖిలప్రియ ఉన్నారు. ఈరోజు బెయిల్ మంజూరు కావడంతో రేపు ఆమె జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

మరోవైపు అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో భార్గవ్ రామ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును పోలీసులు కోరారు. ఈ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉండగా, భార్గవ్ రామ్ ఏ3గా ఉన్నారు.
Bhuma Akhila Priya
9 PM Telugu News
Bail

More Telugu News